Loading...
Asian Games 2026: దక్షిణ కొరియాను చిత్తు చేశారు.. ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లకు గోల్డ్
దక్షిణ కొరియాను చిత్తు చేశారు.. ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లకు గోల్డ్

Asian Games 2026: దక్షిణ కొరియాను చిత్తు చేశారు.. ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లకు గోల్డ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో భారత్‌ వరుస పతకాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలో భారత ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల రికర్వ్‌ ఆర్చరీ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఉదయం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దక్షిణ కొరియాను భారత్‌ 5-3 తేడాతో ఓడించింది. భారత జట్టులో అంకితా భకత్‌, కీర్తి, కుంకుమ్‌ మొహమ్మద్‌ ఉండగా.. దక్షిణ కొరియా జట్టులో కాంగ్‌ చే-యంగ్‌, లీ యుంజి, ఓ యెజిన్‌ ఉన్నారు. ఈ స్వర్ణంతో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 67కి చేరింది. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.

వివరాలు

ఉత్కంఠగా సాగిన ఫైనల్

మొదటి రెండు సెట్లు సమంగా ముగిశాయి. ఇరు జట్లు వరుసగా 54, 56 పాయింట్లు సాధించడంతో పాయింట్లను పంచుకున్నాయి.

ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ కాంగ్‌ చే-యంగ్‌ ఉన్న దక్షిణ కొరియా జట్టు మూడో సెట్‌లో తడబడింది.

మూడో సెట్‌లో కొరియా ఆర్చర్లు వరుసగా మూడు 8 పాయింట్లు సాధించి మొత్తం 52 స్కోరు నమోదు చేశారు. భారత ఆర్చర్లు మాత్రం 55 పాయింట్లు సాధించి ఆ సెట్‌ను కైవసం చేసుకున్నారు.

నాలుగో సెట్‌లో దక్షిణ కొరియా 54 పాయింట్లు సాధించింది. భారత తరఫున కీర్తి 8 పాయింట్లతో ప్రారంభించి.. ఆ తర్వాత కీలక సమయంలో 9 పాయింట్లు సాధించడంతో భారత్‌ కూడా 54 పాయింట్లకు చేరుకుంది.

వివరాలు

సమంగా నాలుగో సెట్

దీంతో నాలుగో సెట్‌ సమంగా ముగిసింది. ఈ క్రమంలో భారత్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

అంతకుముందు భారత్‌ సెమీఫైనల్లో చైనాను 5-1 తేడాతో ఓడించింది.

ఆ తర్వాత ఒకాజాకి చువో సోగో పార్క్‌లో దక్షిణ కొరియాతో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. చైనా జట్టులో యెవీ హువాంగ్‌, క్వి యు, జింగీ జు ఉన్నారు.

ADVERTISEMENT