LOADING...
SRH vs GT: విజృంభించిన గుజరాత్ బౌలర్లు; సన్ రైజర్స్ ఘోర పరాజయం  
గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ ఘోర పరాజయం

SRH vs GT: విజృంభించిన గుజరాత్ బౌలర్లు; సన్ రైజర్స్ ఘోర పరాజయం  

వ్రాసిన వారు Sriram Pranateja
May 16, 2023
12:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు బ్రేక్ పడింది. ఈ రోజు అహ్మదాబాద్లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9/188 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9/154 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్సమెన్ లో శుభ్‌మన్ గిల్ 101(58) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లలో క్లాసెన్ 64(44) భువనేశ్వర్ 26(27),మార్కండే 18(9) పర్వాలేదనిపించారు. మిగతా ఎస్ఆర్ హెచ్ బ్యాట్సమెన్ దారుణంగా విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో షమీ 4,మోహిత్ 4 వికెట్లు తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ ఓటమి