LOADING...
SRH vs KKR IPL 2026 Result: సన్‌రైజర్స్ జోరుకు కేకేఆర్ బ్రేక్.. హైదరాబాద్‌పై ఘన విజయం
సన్‌రైజర్స్ జోరుకు కేకేఆర్ బ్రేక్.. హైదరాబాద్‌పై ఘన విజయం

SRH vs KKR IPL 2026 Result: సన్‌రైజర్స్ జోరుకు కేకేఆర్ బ్రేక్.. హైదరాబాద్‌పై ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
07:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్నసన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు కోల్‌కతా నైట్ రైడర్స్ అడ్డుకట్ట వేసింది. సొంత మైదానంలో జరిగిన ఈ పోరులో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేపట్టి 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు కేవలం 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా అందుకుంది. చేజింగ్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ 59 పరుగులతో కీలక పాత్ర పోషించగా, అజింక్య రహానె 43 పరుగులతో బలమైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఫిన్ అలెన్ వేగంగా 29 పరుగులు చేయగా, రింకు సింగ్ చివర్లో 22 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు.

వివరాలు 

కొలకత్తా ఖాతాలో ఏడు పాయింట్లు

ఈ విజయంతో కోల్‌కతా వరుసగా మూడో గెలుపును నమోదు చేసి పాయింట్ల పట్టికలో తన స్థితిని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి. ఇక 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది నాలుగో ఓటమి హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 61 పరుగులతో ఆకట్టుకోగా, ఇషాన్ కిషన్ 42 పరుగులతో మంచి సహకారం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అభిషేక్ శర్మ, క్లాసెన్ తక్కువ స్కోరుకు వెనుదిరిగారు. స్మరన్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, కమిన్స్ కూడా నిరాశపరిచారు.

వివరాలు 

వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు

ఒక దశలో 8.5 ఓవర్లకు 105 పరుగులతో బలమైన స్థితిలో ఉన్న హైదరాబాద్, ట్రావిస్ హెడ్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. దీంతో పరుగుల వేగం పూర్తిగా తగ్గిపోయింది. చివరకు కేవలం 60 పరుగుల వ్యవధిలోనే చివరి 9 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌలింగ్‌లో కోల్‌కతా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా, కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీశాడు. సునీల్ నరైన్ కూడా 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement