SRH Vs LSG : హైదరాబాద్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు..!
ఐపీఎల్ 2023 సీజన్ లో సొంతగడ్డపై అన్ని టీంలు విజయాలు సాధిస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలను చవిచూస్తోంది. నేడు లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ తన ఫ్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. సన్ రైజర్స్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో ఈ విజయంతో ఫ్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (47), అబ్దుల్ సమద్ (37), అన్నోల్ ప్రీత్ సింగ్ 36 రన్స్ తో రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.
దంచికొట్టిన నికోలస్ పూరన్
లక్ష్య చేధనకు దిగిన లక్నో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించింది. కేల్ మేయర్స్ 2 రన్స్ తో నిరాశపరిచాడు. తర్వాత క్వింటాన్ డికాక్ 29 పరుగులు చేసి ఔట్ కావడంతో లక్నో రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రేరక్ మన్కడ్ (64నాటౌట్;45 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. మార్కస్ స్టోయినిస్( 40; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆఖర్లో నికోలస్ పూరన్( 44నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. అభిషేక్ శర్మ వేసిన 16 ఓవర్లలో 6,6,wd,w,6,6,6 రావడంతో లక్నో గెలుపు సులభమైంది.సన్ రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మార్కండే,అభిషేక్ శర్మ తలా ఓ వికెట్ తీశారు.