SRH Vs LSG : రాణించిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2023 భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మూడో ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (7) వికెట్ కీపర్ డికాక్ క్యాచ్ ఇచ్చి పెవిలియానికి చేరాడు. మరోవైపు ధాటి ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 20; 4 ఫోర్లు) యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ 36 రన్స్ తో మంచి ఫామ్ లో ఉండగా.. అమిత్ మిశ్రా అతన్ని బౌల్డ్ చేశాడు. .
182 పరుగులు చేసిన సన్ రైజర్స్
దీంతో సన్ రైజర్స్ 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్లలో కృనాల్ పాండ్యా వరుస బంతుల్లో మార్ర్కమ్, ఫిలిప్స్ ను ఔట్ చేసి సన్ రైజర్స్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అయితే సన్ రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ (28), హెన్రిచ్ క్లాసిన్ (47), అబ్దుల్ సమద్ 37 పరుగులతో చేలరేగారు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, అమిత్ మిశ్రా, యద్ధ్‌వీర్ సింగ్, అవేశ్ ఖాన్, యాష్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు.