Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అద్భుతంగా రాణించింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంకపై విజయం సాధించింది.
వర్షంతో 42 ఓవర్లకు కుదించిన మ్యాచులో తొలుత పాక్ 252/7 స్కోరు చేయగా, లంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని చేధించింది.
పాక్ బ్యాటర్లలో రిజ్వాన్(86). షఫిక్(52), ఇఫ్తికర్ అహ్మద్(47) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
శ్రీలంక బౌలర్లలో పతిరన 3, ప్రమోద మదుశాన్ రెండు వికెట్లు తీశారు
Details
ఫైనల్ లో భారత్ తో తలపడనున్న శ్రీలంక
కుశాల్ మెండిస్ అద్భుతంగా రాణించి శ్రీలంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 97 బంతుల్లోనే 91 పరుగులు చేసి చెలరేగిపోయాడు.
అతనికి తోడు సదీరా(48), చరిత్ అసలంక(49) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
చివరి ఓవర్లలో 8 రన్స్ అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 2 ఇచ్చి జమాన్ ఖాన్ ఒక వికెట్ తీశారు. అయితే చివరి రెండు బంతులకు అసలంక 4, 2 రన్స్ చేసి శ్రీలంకకు చరిత్రక విజయాన్ని అందించారు.
ఇక పాకిస్థాన్ పై విజయం సాధించిన లంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో భారత్‌తో శ్రీలంక పోటీ పడనుంది.