IPL 2026: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన స్టార్ ప్లేయర్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో టాప్ వీరే
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. అవన్నీ నాకౌట్ పోరులే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్లు సాయి సుదర్శన్ - గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో అద్భుతమైన స్థిరత్వంతో రాణిస్తున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 157.92 స్ట్రైక్‌రేట్‌తో 638 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక ఫోర్లు (62) కూడా అతడే బాదాడు.
వివరాలు
శుభమాన్ గిల్ - గుజరాత్ టైటాన్స్
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 13 మ్యాచ్‌ల్లో 161.67 స్ట్రైక్‌రేట్‌తో 616 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టును ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
హెన్రిచ్ క్లాసిన్ - సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ 14 మ్యాచ్‌ల్లో 159.47 స్ట్రైక్‌రేట్‌తో 606 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో ఇప్పటికే ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశాడు.
ఇతర ఆసక్తికర రికార్డులు
అత్యధిక సిక్సర్లు: వైభవ్ సూర్యవంశీ (53 సిక్సర్లు)
వేగవంతమైన సెంచరీ: వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో)
వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఉర్విల్ పటేల్ (13 బంతుల్లో)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: కేఎల్ రాహుల్ (152 నాటౌట్)
వివరాలు
బౌలింగ్‌లో మెరిసిన స్టార్లు
భువనేశ్వర్ కుమార్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
భువనేశ్వర్ కుమార్ 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/23.
కగిసో రబడ - గుజరాత్ టైటాన్స్
రబాడ కూడా 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు సాధించి భువీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 3/25.
జోఫ్రా ఆర్చర్ - రాజస్థాన్
జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్‌లో 21 వికెట్లు తీసి రాజస్థాన్ బౌలింగ్‌కు వెన్నెముకలా మారాడు. అతడి బెస్ట్ ప్రదర్శన 3/17.
వివరాలు
అన్షుల్ కంబోజ్
అన్షుల్ కాంబోజ్ కూడా 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 3/22.
ఇతర బౌలింగ్ రికార్డులు
అత్యధిక మెయిడిన్ ఓవర్లు: మోసిన్ ఖాన్ (3 మెయిడిన్లు)
అత్యధిక డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్ - 14 మ్యాచ్‌ల్లో 148 డాట్ బంతులు
బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్: మోసిన్ ఖాన్ - కేకేఆర్‌పై 5/23
అత్యంత ఖరీదైన స్పెల్: జేవియర్ బార్ట్‌లెట్ - నాలుగు ఓవర్లలో 69 పరుగులు సమర్పించాడు.