తదుపరి వార్తా కథనం
Gongadi Trisha: ఓ వైపు చదువు.. మరోవైపు రోజుకు 8 గంటలు క్రికెట్ సాధన : తండ్రి రాంరెడ్డి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 04, 2025
03:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో గొంగడి త్రిష అద్భుత ప్రదర్శనపై ఆమె తండ్రి రాంరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
మలేసియాలో జరిగిన టోర్నీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన త్రిషను స్వాగతించిన సందర్భంగా రాంరెడ్డి మీడియాతో మాట్లాడారు.
క్రికెట్ పట్ల త్రిషకు చిన్నతనం నుంచి ఆసక్తి ఉండేదని, విద్యాభ్యాసంతో పాటు ప్రతిరోజూ 8 గంటల పాటు కష్టపడుతూ సాధన చేసిందని రాంరెడ్డి తెలిపారు.
Details
భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిష
త్రిష కృషి, నిబద్ధత కారణంగా మహిళలు కూడా క్రికెట్‌లో గొప్ప స్థాయికి చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆరంభం నుంచే త్రిష తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మెరిసి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.
భారత జట్టు కప్ గెలవడంలో త్రిష పాత్ర ఎంతగానో ఉందని రాంరెడ్డి ప్రశంసించారు.