పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఈ ఏడాది ఐపీఎల్ టీ20 టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. అతను గతంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించారు.
PBKS ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ ఆధ్వర్యంలో జోషి పనిచేయనున్నారు. 2020 ప్రారంభంలో భారతదేశ సెలక్షన్ ప్యానెల్‌లో జోసి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
జోషి బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టుకు స్పిన్-బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. హైదరాబాద్, కాశ్మీర్, అస్సాం వంటి రంజీ జట్లతో పనిచేసిన అనుభవం ఉంది. 2008-09 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున నాలుగు మ్యాచ్ లు ఆడాడు.
పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్‌ధావన్
దేశవాళీ కర్ణాటక జట్టుకు జోషీ అప్పట్లో కీలకమైన ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించారు. 1996లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 15 టెస్టులు ఆడి 41 వికెట్లు... 69 వన్డేలు ఆడి 69 వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ గా వసీం జాఫర్ మళ్లీ నియామకం అయ్యారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
2014లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఈ సారైనా కప్ సాధిస్తుందేమో లేదో వేచిచూడాల్సిందే.