Page Loader
ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ

ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2022
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్, ఫిటినెస్ సమస్యతో బాధపడుతున్నారు. దాని ప్రభావం అతని సంపాదన మీద పడకపోవడం గమనార్హం. సంపాదనలో ఏకంగా ధోని, కోహ్లీని వెనక్కి నెట్టి ఐపీఎల్ లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. గతేడాది రోహిత్ శర్మకు టీమిండియా జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అతని సారథ్యంలో టీ20, వన్డేలో మెరుగైన ప్రదర్శన జట్టు చేసింది. అయితే టీ20 ప్రపంచ కప్ రోహిత శర్మ ఫామ్ కోల్పోవడంతో భారత జట్టు ప్రపంచ కప్ ను నుంచి నిష్క్రమించింది. అయితే ఐపీఎల్ నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

రోహిత్ శర్మ

ఐపీఎల్ ద్వారా రోహిత్ సంపాదన రూ.178.6 కోట్లు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో ఐపీఎల్ ద్వారా మొత్తం 178.6 కోట్లు సంపాదించాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. రోహిత్ త‌ర్వాత ధోని 176.84 కోట్లు ఆర్జించాడు. ఈ జాబితాలో 173. 2 కోట్ల‌తో విరాట్ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. రూ. 110 కోట్ల‌తో రైనా నాలుగో స్థానంలో, 109 కోట్ల జ‌డేజా ఐదో స్థానంలో నిలిచారు. వీరి త‌ర్వాత వెస్టిండీస్ ఆట‌గాడు సునీల్ న‌రైన్ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మొదట ఐపీఎల్ లో రోహిత్ శర్మను డెక్కన్ ఛార్జర్స్ మూడు కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ నుంచి ముంబాయి ఇండియన్స్ అతడికి రూ. 16 కోట్లు చెల్లిస్తోంది.