LOADING...
Mohammed Shami: మహ్మద్ షమీ ధాటికి విలవిలలాడిన సన్ రైజర్స్ బ్యాటర్స్!
మహ్మద్ షమీ ధాటికి విలవిలలాడిన సన్ రైజర్స్ బ్యాటర్స్!

Mohammed Shami: మహ్మద్ షమీ ధాటికి విలవిలలాడిన సన్ రైజర్స్ బ్యాటర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్ నుంచే మహమ్మద్ షమీ తన అనుభవాన్ని పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ బౌలింగ్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (7)ను షమీ అవుట్ చేసాడు. ఎయిడెన్ మార్క్రామ్ వేసిన అద్భుతమైన క్యాచ్‌తో హెడ్ ప్లేయింగ్ నుంచి వెనుదిరిగాడు. వెంటనే మరొక ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా షమీ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. మణిమారన్ సిద్ధార్థ్ చేతిలో పడిన అభిషేక్ క్యాచ్‌తో హైదరాబాద్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

వివరాలు

ప్రిన్స్ యాదవ్ ప్రతాపం

మరోవైపు యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపుతాడని భావించిన కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశారు. పవర్ ప్లే ముగియకముందే మూడు కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ తీవ్ర ఒత్తిడిలోకి చేరింది.

వివరాలు

క్రీజులో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి

ప్రస్తుతం క్రీజులో స్టార్ బ్యాటర్లు క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించే బాధ్యత ఇప్పుడు వీరిపైనే ఉంది. లక్నో బౌలర్లు అదే పేస్‌తో బౌలింగ్ చేస్తే, సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించడం కష్టమని కనిపిస్తోంది.

Advertisement

వివరాలు

లక్నో బౌలర్ల ఆధిపత్యం

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు పిచ్‌ను సరిగ్గా వినియోగిస్తున్నారు. మహమ్మద్ షమీ రెండు ఓవర్లలో తక్కువ పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్ బ్యాటింగ్‌ ని విరిచాడు. ప్రిన్స్ యాదవ్ కూడా సరిగ్గా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు. సన్‌రైజర్స్ ఈ పరిస్థితి నుండి బయటపడుతూ గౌరవప్రదమైన స్కోరు సాధిస్తుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్ ఫలితం హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement