LOADING...
SRH vs PBKS: ఉప్పల్‌లో ఉత్కంఠభరిత పోరు.. విజేతకు ప్లే ఆఫ్స్ టికెట్ దాదాపు ఖాయం!
ఉప్పల్‌లో ఉత్కంఠభరిత పోరు.. విజేతకు ప్లే ఆఫ్స్ టికెట్ దాదాపు ఖాయం!

SRH vs PBKS: ఉప్పల్‌లో ఉత్కంఠభరిత పోరు.. విజేతకు ప్లే ఆఫ్స్ టికెట్ దాదాపు ఖాయం!

వ్రాసిన వారు Moogati Shabari
May 06, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పాయింట్ల పట్టికలో ఇంకా అనేక జట్లు పోటీలో ఉండటంతో ప్రతి పోటీ కూడా ఫైనల్ తరహాలో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఈ రోజు జరిగే సన్‌ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. ఈ పోరులో గెలిచే జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలను బలపరుచుకుంటుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ సమరానికి వేదిక. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో వీక్షించవచ్చు.

వివరాలు

ప్లే ఆఫ్స్ ప్రవేశం మరింత సులభం..

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ముందంజలో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లలో 6 గెలుపులతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 14కి పైగా పాయింట్లను అందుకుని టాప్-4లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటుంది. ముఖ్యంగా పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ప్రవేశం మరింత సులభమవుతుంది.

వివరాలు

పోరులో గెలిచేదెవరు?

ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే ఒకసారి తలపడగా, ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఆ పోరులో పెద్ద లక్ష్యాన్ని సులభంగా చేధించింది. ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే, ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 విజయాలు సాధించగా, పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో గెలిచింది. ఉప్పల్ వేదికగా జరిగిన 10 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ 9 సార్లు విజయం సాధించడం విశేషం.

Advertisement

వివరాలు

జట్ల వివరాలు ఇవే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్ష్ దూబే, షాకీబు హుస్సేన్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ. పంజాబ్ కింగ్స్ అంచనా జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, కూపర్ కాన్‌లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, సూర్యాన్షు షెడ్జే, నేహాల్ వధేరా, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వైశాక్.

Advertisement