Smriti Mandhana: వరల్డ్ కప్ వేదికపై స్మృతి మంధానకు సర్‌ప్రైజ్ ప్రపోజల్.. పలాశ్ వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తన కాబోయే జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ప్రపోజల్‌ను అందుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మధుర క్షణాలకు వేదికైంది. స్మృతి మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అక్కడే మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేశాడు. పలాశ్ ప్రపోజల్‌కు స్పందించిన మంధాన అతణ్ని ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని తెలిపింది. అనంతరం ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని ఈ ప్రత్యేక క్షణాన్ని మరింత అందంగా మార్చుకున్నారు. ఈ ప్రపోజల్ వీడియోను పలాశ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, క్షణాల్లో వైరల్ అయ్యింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
At DY Patil stadium... Queen Smriti Mandhana said yes and Palash Muchhal walked out as Mr. Palash Mandhana... Congratulations 💃🎉🥳🎊 pic.twitter.com/UEfBiZgelR
— Bonny 🎀💕 (@harryjeee) November 21, 2025