LOADING...
ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు
31 బంతుల్లో 66 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సంచనల రికార్డును నమోదు చేశాడు. మొహాలీలో జరిగిన 46వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో తన మూడో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (75)తో కలిసి 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా ఐపీఎల్ లో 2900 పరుగులు పూర్తి చేసిన బ్యాట్‌మెన్స్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు.

Details

6000 పరుగుల మైలురాయిని చేరుకున్న సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో 6000 పరుగుల మైలురాయిని దాటుకున్నాడు. ఇప్పటివరకూ 252 టీ20 మ్యాచుల్లో 34.25 సగటుతో 6165 పరుగులను పూర్తి చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి. ఐపీఎల్లో 19 అర్ధ సెంచరీలను బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో 175.76 స్ట్రైక్ రేట్‌తో 1,675 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 214 పరుగుల భారీ స్కోరును చేసింది. లివింగ్ స్టోన్ 82, జితేశ్ శర్మ 49 పరుగులతో చెలరేగాడు. లక్ష్య చేధనకు దిగిన ముంబై 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 216 పరుగుల భారీ స్కోరును చేసింది. ఐపీఎల్లో ఐదుసార్లు 200 ప్లస్ స్కోరును చేధించిన జట్టుగా ముంబై అవతరించింది.