విజయంతో పైకొచ్చిన ముంబాయి.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ లో స్వల్ప మార్పులివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ముంబై చేధించింది.
200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండోసారి సాధించిన అరుదైన జట్టుగా ముంబై నిలిచింది.
పంజాబ్ వ్యూహాలకు చెక్ పెడుతూ ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో ముంబై 5వ విజయాన్నినమోదు చేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.
9 మ్యాచ్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి రోహిత్ సేన ఆరో స్థానంలో నిలిచింది. మరోపక్క పంజాబ్ ఈ పరాజయంతో ఓ స్థానం దిగజారి 8వ స్థానానికి చేరుకుంది.
Details
అగ్రస్థానంలో గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో నిలిచింది.
ఇక ఆరెంజ్ క్యాప్ లీడులో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 9 మ్యాచ్ ల్లో 446 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. యశస్వీ జైస్వాల్ 428, డేవాన్ కాన్వే 424, విరాట్ కోహ్లీ 364 రన్స్ తో తర్వాతి స్థానంలో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. మహ్మద్ షమీ 9 మ్యాచ్ లో 17 వికెట్లు పడగొట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తుషార్ దేశ్ పాండే కూడా 17 వికెట్లతో రెండో స్థానంలో నిలవడం విశేషం. అర్ష్ దీప్ సింగ్ 16, పీయూష్ చావ్లా 15 వికెట్లతో తదుపరి స్థానంలో నిలిచారు.