MI vs PBKS : కొండంత లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
పంజాబ్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై చేధించింది. ముంబై కేవలం 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరును చేసింది.పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ 82, జితీష్ శర్మ 49 పరుగులతో విజృంభించారు.
ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2, అర్షద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.
Details
దంచికొట్టిన ముంబై బ్యాటర్లు
లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ తొలుత రోహిత్ శర్మ (0) వికెట్ ను కోల్పోయింది.
ఇషాన్ కిషాన్, గ్రీన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గ్రీన్ 23 పరుగులతో రాణించాడు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్ తో పరుగులను రాబట్టాడు. అతనికి ఇషాన్ కిషాన్ తోడు అవ్వడంతో మొహాలీ స్టేడియంలో పరుగుల వరద పారింది.
ఇషాన్ కిషాన్ (75), సూర్యకుమార్ 66 పరుగులను చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.
చివర్లో తిలక్ వర్మ 26, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.పంజాబ్ బౌలర్లలో ఇల్లీస్ 2, అర్షదీప్ సింగ్, రిషి ధావన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.