లివింగ్ స్టోన్, జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట ముంబై కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీల వర్షం కురిపిస్తూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్ 17 పరుగులకు తన తొలి వికెట్ ను కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ షింగ్ 9 పరుగులతో నిరాశ పరిచగా.. శిఖర్ ధావన్ 30, మాథ్యూ షార్ట్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ చివరి వరకూ క్రీజులో నిలబడి పంజాబ్ కు భారీ స్కోరును అందించారు.
హ్యాట్రిక్ సిక్సర్లలో చెలరేగిన లివింగ్ స్టోన్
18 ఓవర్లలో జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో లివింగ్ స్టోన్ వరుసగా మూడు హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. లివింగ్ స్టోన్ 42 బంతుల్లో (4 సిక్సర్లు 7 ఫోర్లు) 82 పరుగులు, జితేష్ శర్మ 27 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) 49 పరుగులతో విజృంభించారు. వీరిద్దరూ 53 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి పంజాబ్ 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2, అర్షద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.