NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు
    PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు
    క్రీడలు

    PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    April 30, 2023 | 07:47 pm 0 నిమి చదవండి
    PBKS vs CSK: థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపు
    చివరి బంతికి విజయాన్ని అందుకున్న పంజాబ్

    పంజాబ్ కింగ్స్ తో జరిగిన సొంత మైదానంలో చైన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చివరికి పంజాబ్ నే విజయం వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 200 పరుగుల భారీ స్కోరును చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 92 పరుగులు చేసి విజృంభించాడు. చివర్లో శివందూబే28(17) , ధోని 13(4) పరుగులతో చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, సామ్ కర్రన్, సికిందర్ రాజా తలా ఓ వికెట్ సాధించారు.

    చివరి బంతికి విజయాన్ని అందుకున్న పంజాబ్

    లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. పంజాబ్ బ్యాటర్లలో ఫ్రబ్ సిమ్రాన్ సింగ్ 42, లివింగ్ స్టోన్ 40, ధావన్ 28, సామ్ కర్రన్ 29, జితేష్ వర్మ 21 పరుగులు చేశారు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. పంజాబ్ మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు సాధించింది. చివరి నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేసింది. జితేష్ శర్మ చివరిబంతికి మూడు పరుగులు చేసి పంజాబ్ ను విజయతీరాలకు తేర్చాడు. పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. చైన్నై బౌలర్లలో దేశ్ పాండ్ 3 వికెట్లు, జడేజా రెండు వికెట్లు, పతిరణ ఒక వికెట్తో ఫర్వాలేదనిపించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఐపీఎల్

    ఐపీఎల్

    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై చైన్నై సూపర్ కింగ్స్
    PBKS vs LSG: లక్నో ధాటికి పంజాబ్ బౌలర్లు విలవిల: 258పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసిన లక్నో  క్రీడలు
    RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం  రాజస్థాన్ రాయల్స్
    RR vs CSK: అర్థ సెంచరీతో బ్యాట్ ఝళిపించిన యశస్వి; చెన్నై లక్ష్యం 203పరుగులు  రాజస్థాన్ రాయల్స్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023