టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ గా సూర్యకుమార్ యాదవ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఆప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లో పాకిస్తాన్ క్రికెట్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతంగా రాణించాడు. ఐదో టీ20లో 98 పరుగులు చేసి తన ర్యాకింగ్స్ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 811 పాయింట్లతో రిజ్వాన్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. బాబార్ ఆజం 756 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవర్లలో 193/5 పరుగులు చేసింది. ఇందులో రిజ్వాన్ ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ పై కివీస్ విజయం
ఈ మ్యాచ్ లో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 193 పరుగుల స్కోరును కివీస్ చేధించింది. కివీస్ ఆటగాడు చాప్ మన్ 104(57), జేమ్స్ నీషమ్ 45(25) విజృంభించడంతో కివీస్ విజయం సాధించింది. ఐసీసీ ర్యాకింగ్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ 748 పాయింట్లతో నాలుగో స్థానం, యూఏఈకి చెందిన మహ్మద్ వసీ 716 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్ కి, సూర్యకుమార్ యాదవ్ కంటే 95 పాయింట్ల తక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చాప్‌మన్ కెరీర్‌లో 45 స్థానాలు ఎగబాకి 35 వ స్థానానికి చేరుకోవడం విశేషం.