ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్
సూర్య భాయ్.. ఇది పేరు కాదు! ఇట్స్ ఏ బ్రాండ్.. టీ20ల్లో ఈ బ్రాండ్ చేస్తున్న రీసౌండ్ మామూలుగా లేదు. గతేడాది చివరన ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం.1 ప్లేస్ ని దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ తాజాగా మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ICC T20I ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ను పొంది రికార్డును బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20, రెండో టీ20 అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాకింగ్స్ లో 910 పాయింట్లకు చేరుకున్నాడు. ఇంతకుముందు టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచిన విషయం తెలిసిందే.
మరో రికార్డుకు చేరువలో సూర్యకుమార్ యాదవ్
విరాట్ కోహ్లీ టీ20ల్లో 897 పాయింట్లు సాధించగా.. టీ20ల్లో 900+ పాయింట్లు సాధించి సూర్యకుమార్ యాదవ్ మొట్టమొదటి భారత్ క్రికెటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా టీ20ల్లో 900+ రేటింగ్ పాయింట్లు తెచ్చుకున్న మూడో బ్యాటర్ గా సూర్య చరిత్రకెక్కాడు. 2020లో కేప్ టౌన్‌లో 915 పాయింట్ల గరిష్ట స్థాయిని సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో 30+ స్కోర్ చేస్తే సూర్య మొదటి స్థానంలో నిలిచాడు.