సూర్యకుమార్ పాకిస్తాన్‌లో పుట్టి ఉంటే కష్టమే: పాక్ మాజీ కెప్టెన్
సూర్యకుమార్ యాదవ్ లేటు ఎంట్రీ ఇచ్చినా టీమిండియా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్స్ కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ సొంతం చేసుకుంది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ పై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్లు దాటాక క్రికెట్ లోకి వచ్చాడు. అతను ఇండియా పుట్టడం తన అదృష్టం, పాకిస్తాన్ లో ఉంటే 30 ఏళ్లు దాటితే ఛాన్స్ వచ్చే అవకాశం ఉండదని చెప్పారు.
పీసీబీ వైఖరిని తప్పుపట్టిన సల్మాన్ భట్
పిసిబి పాలసీని సల్మాన్ భట్ విమర్శించాడు. సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడానికి చాలా కష్టపడి ఉండేవాడని చెప్పారు. గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రజా.. 30 ఏళ్లు నిండిన ఏ ఆటగాడికి జాతీయ జట్టులో చేరడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలానే చాలా మంది ప్లేయర్స్ అవకాశాలు కోల్పోయారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లు జట్టులోకి రాలేకపోతున్నారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను ఉదాహరణగా చూపుతూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పీసీబీ వైఖరిని తప్పుపట్టాడు.