Ayush Badoni: న్యూజిలాండ్ సిరీస్‌కు అయుష్ బదోని ఎంపికపై స్పందించిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ యువ ఆటగాడు అయుష్ బదోనిని టీమ్ ఇండియా జట్టులోకి తీసుకున్నారు. అయితే అయుష్ బదోని ఎంపికపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బదోని స్థానంలో రియాన్ పరాగ్ లేదా రింకూ సింగ్‌లను తీసుకోవాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు ముందు జరిగిన మీడియా సమావేశంలో భారతబ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఈ ఎంపికపై స్పందించారు. అయుష్ బదోని ఇండియా'ఏ'తరఫున వచ్చిన అవకాశాల్లోనూ,ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడని తెలిపారు. వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేసేలా రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలింగ్ చేయగల సామర్థ్యం బదోనికి ఉందని,అందుకే అతడిని 'లైక్ టు లైక్' రీప్లేస్‌మెంట్‌గా భావించినట్లు కోటక్ చెప్పారు.
వివరాలు
ఐదు బౌలర్లతోనే ఆడటం సాధ్యం కాదు
ఈ సందర్బంగా మీడియాతో కోటక్ మాట్లాడుతూ... "అతడు ఆడుతున్నాడు, మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ఇండియా 'ఏ' వన్డే మ్యాచ్‌ల్లో రాణించాడు. జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్ల పని. కానీ వాషింగ్టన్ లాంటి ఆల్‌రౌండర్ లేకపోతే కేవలం ఐదు బౌలర్లతోనే ఆడటం సాధ్యం కాదు. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ నాలుగో లేదా ఐదో ఓవర్‌లో గాయపడితే మిగిలిన ఓవర్లు ఎవరు వేస్తారు? అందుకే ప్రతి జట్టుకూ ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరం. కొన్నిసార్లు అది వాషింగ్టన్ లాంటి ఆల్‌రౌండర్ కావచ్చు, లేదంటే బ్యాటింగ్ ఎక్కువగా చేసి కొంత బౌలింగ్ చేసే ఆటగాడు కావచ్చు. అవసరమైతే నాలుగు లేదా ఐదు ఓవర్లు అయినా వేయగలగాలి.
వివరాలు
27 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన అయుష్ బదోని 693 పరుగులు
బదోని ఇండియా 'ఏ' తరఫున రెండు అర్ధశతకాలు చేశాడు. బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్,వైట్ బాల్ క్రికెట్‌లో అతడి ప్రదర్శన బాగుంది. అతడికి శుభాకాంక్షలు" అని కోటక్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 27 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన అయుష్ బదోని 693 పరుగులు చేశాడు. అతడి సగటు 36.47 కాగా, స్ట్రైక్‌రేట్ 93కి పైగా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 100. అదే సమయంలో 18 వికెట్లు కూడా తీసుకున్నాడు. బౌలింగ్ సగటు 29.72 కాగా, ఎకానమీ 4.54గా ఉంది. బెస్ట్ ఫిగర్స్ 3/29.
వివరాలు
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 963 పరుగులు
గత ఏడాది దక్షిణాఫ్రికా 'ఏ' జట్టు భారత్ పర్యటనలో రెండో అనధికార వన్డేలో బదోని 66పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 4 ఓవర్లకు 15 పరుగులు,7ఓవర్లకు 43పరుగులు ఇచ్చాడు. అలాగే, ఆస్ట్రేలియా 'ఏ' జట్టు భారత్ పర్యటనలో రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్‌లో అతడి బౌలింగ్ సగటు 16.33గా నమోదైంది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో 21పరుగులు కూడా చేశాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 56 మ్యాచ్‌లు,46 ఇన్నింగ్స్‌లు ఆడిన బదోని మొత్తం 963 పరుగులు సాధించాడు. సగటు 26.75,స్ట్రైక్‌రేట్ 138.56గా ఉన్నాయి. ఆరు అర్ధశతకాలు చేయగా, అత్యుత్తమ స్కోరు 74.ఈ గణాంకాలే అతడి ఎంపికకు బలంగా నిలిచాయని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడుతోంది.