Loading...
Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన టీమిండియా కోచ్.. ఏమన్నారంటే?
రోహిత్ రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన టీమిండియా కోచ్.. ఏమన్నారంటే?

Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన టీమిండియా కోచ్.. ఏమన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, అతని భవిష్యత్తుపై భారత జట్టు మేనేజ్‌మెంట్ తొలిసారి స్పందించింది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ప్రణాళికల్లో భాగంగా రోహిత్‌కు జట్టులో స్థానం ఉండదని బీసీసీఐ ఇప్పటికే హిట్‌మ్యాన్‌కు తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ కావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో, టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు.

వివరాలు

రోహిత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు

రోహిత్ రిటైర్మెంట్‌పై నేరుగా స్పందించకుండా ప్రశ్నను దాటవేసిన కోటక్, అతని ప్రస్తుత ఫామ్‌పై మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రోహిత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేస్తూ, అతను భారత జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడని పేర్కొన్నారు.

ఇషాన్ కిషన్ లేదా యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా తీసుకురావాలనే చర్చలపై స్పందించిన కోటక్.. వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనందుకు మాత్రమే రోహిత్ ఆటను అంచనా వేయడం సరికాదని అన్నారు.

వివరాలు

రోహిత్ టాప్ క్లాస్ బ్యాటర్

రోహిత్ ప్రపంచస్థాయి బ్యాటర్ అని కొనియాడిన కోటక్, ఒకసారి అతను లయ అందుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు అతడిని నిలువరించడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు.

అలాంటి ఆటగాడు భారత జట్టుకు ఇప్పటికీ అవసరమేనని స్పష్టం చేశారు.

అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు కోటక్ సమాధానం ఇవ్వకుండా మౌనం పాటించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

39 ఏళ్ల రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

2027 ప్రపంచకప్ లక్ష్యంగా.. కానీ ఫామ్ నిరాశాజనకం

అందుకోసం తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు.

శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, ఇటీవల బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 143 పరుగులు చేశాడు.

ఇందులో తొలి వన్డేలో 69 బంతుల్లో 79 పరుగులు సాధించగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో 48, 16 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా రోహిత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 11, 26 పరుగులకే పరిమితమై అభిమానులను నిరాశపరిచాడు.

ఈ పరిస్థితుల్లో లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే తర్వాత రోహిత్ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT