టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం
టెస్టుల్లో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఎంఆర్ ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాకింగ్స్ లో టీమిండియా అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. 15 నెలలుగా మొదటి స్థానంలో ఉన్న ఆసీస్.. టీమిండియాకు దెబ్బకు కిందకు దిగొచ్చింది. జూన్ ఏడు నుంచి జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు టీమిండియా టాప్ ర్యాంకు రావడం గర్వించదగ్గ విషయం. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీఎఫ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
121 పాయింట్లతో టీమిండియా మొదటి స్థానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించిన టీమిండియా.. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్ లో భారత్ 121 పాయింట్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 116 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇంగ్లండ్ 114, సౌతాఫ్రికా 104, న్యూజిలాండ్ 100, పాకిస్తాన్ 86 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.