LOADING...
IND w vs AUS w: తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

IND w vs AUS w: తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 48.3 ఓవర్లలో 214పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఆసీస్‌ 38.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి సునాయాసంగా గెలుపు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించింది. కెప్టెన్ అలిస్సా హీలీ 70 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేసి అర్ధసెంచరీ నమోదు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

Details

హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ

ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. ఆష్లీ గార్డనర్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే జార్జియా వాల్ డకౌట్‌గా వెనుదిరిగింది. భారత బౌలర్లలో శ్రీ చరణి 2 వికెట్లు పడగొట్టగా క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో వికెట్‌ తీశారు. భారత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 68 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసి మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 3 ఫోర్లతో 53 పరుగులు చేసి అర్ధసెంచరీ సాధించింది. కాశ్వీ గౌతమ్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 పరుగులు చేసి తృటిలో హాఫ్‌సెంచరీ చేజార్చుకుంది.

Details

ప్రతీక రావల్ డకౌట్

జట్టులోకి తిరిగి వచ్చిన ప్రతీక రావల్ డకౌట్‌గా నిలిచింది. షఫాలీ వర్మ (4), జెమిమా రోడ్రిగ్స్ (8), దీప్తి శర్మ (2), క్రాంతి గౌడ్‌ (2), శ్రీ చరణి (2) నిరాశపరిచారు. రిచా గౌస్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఆష్లీ గార్డనర్ 3 వికెట్లు తీసి రాణించగా, మేగాన్ షట్ 2 వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్, అలానా కింగ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్ చెరో వికెట్‌ సాధించారు. మొత్తంగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా తొలి వన్డేను సొంతం చేసుకుంది.

Advertisement