IND vs SA: మరోసారి టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
గువాహటిలో టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మరోసారి పోటీకి దిగాయి. ఈమ్యాచ్‌లో కూడా భారత జట్టు టాస్ అదృష్టం కలిసిరాలేదు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 0-1తేడాతో వెనుకబడి ఉండటంతో, ఈ రెండో మ్యాచ్ సిరీస్ పరంగా టీమ్‌ఇండియాకు అత్యంత కీలకంగా మారింది. కోల్‌కతా టెస్ట్‌లో గాయపడ్డ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. గువాహటిలో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక్కడ సూర్యోదయం త్వరగా జరుగుతుందని, అందుకే మ్యాచ్‌ను సాధారణ సమయానికి కంటే అరగంట ముందుగానే ప్రారంభించారు. ఇదే కారణంగా ఈసారి మొదట టీ బ్రేక్ ఉంటే, తర్వాత లంచ్ బ్రేక్ జరగనుంది.
Details
ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే
భారత తుది జట్టు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా తుది జట్టు ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టాన్ స్టబ్స్, కైల్ వేరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సేనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్