Team India: టీ20 ప్రపంచకప్ విజేతల రాక కోసం అభిమానుల ఎదురు చూపులు.. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్,దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. 17ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడిన సంగతి తెలిసిందే. వారికి ఘన స్వాగతం పలకటానికి క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.అయితే ద్వీప దేశంలో బెరిల్ హరికేన్ ముప్పుతో భారత జట్టు బార్బడోస్ నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకోవడం మరింత ఆలస్యమైంది. జూలై 2న వారు బార్బడోస్ నుండి స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6గంటలకు బయలుదేరి బుధవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోవాలని భావిస్తున్నారు. అయితే,ఈ ప్రారంభ ప్రణాళికను మార్చినట్లు తాజా అప్ డేట్ తెలిపింది.
గురువారం తెల్లవారుజామున రావచ్చు
ఇండియా టుడే, విక్రాంత్ గుప్తా ప్రకారం, జూలై 4, గురువారం తెల్లవారుజామున జట్టు ఢిల్లీకి రాకపోవచ్చు. "భారత జట్టు బార్బడోస్ నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకోవడం మరింత ఆలస్యం అవ్వనుంది. ఈ విషయమై రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాము. ప్రస్తుతం వారు గురువారం ఉదయం 4-5 గంటలలోపు ఢిల్లీకి రానున్నారు" అని విక్రాంత్ గుప్తా ట్వీట్ చేశారు.