
Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్‌కి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
శుభ్‌మన్ గిల్ ఇంగ్లంతో జరిగిన టెస్టు సిరీస్‌లో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ జూలై 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా ఎంపికయ్యాడు. ఆ నెలలో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ 3 టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు సాధించాడు. ఈ రేసులో ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆటగాడు వియాన్ ముల్డర్ ఉన్నప్పటికీ, అవార్డు గిల్‌కే దక్కింది. మొత్తం సిరీస్‌లో 4 సెంచరీలతో కలిపి 754 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెరీర్‌లో గిల్ నాలుగోసారి ఈ అవార్డు గెలుచుకోవడం విశేషం.
Details
అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అలాగే 2023 జనవరి, సెప్టెంబర్‌లలోనూ ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నాడు. పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఈ బిరుదు అందుకున్న తొలి ఆటగాడిగా గిల్ రికార్డు నెలకొల్పాడు. మహిళల్లో వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్, ఆస్ట్రేలియా ఆటగాడు ఆష్లీ గార్డ్‌నర్ చెరో నాలుగుసార్లు ఈ అవార్డును సాధించారు. ఐసీసీ జూలై మహిళల 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ ఎంపికైంది. భారత్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో ఆమె 7 మ్యాచ్‌ల్లో 270 పరుగులు చేసింది.
Details
బర్మింగ్‌హామ్ ద్విశతకం మరపురాని జ్ఞాపకం
ఇంగ్లండ్‌పై బర్మింగ్‌హామ్‌లో సాధించిన ద్విశతకం జీవితాంతం గుర్తుండిపోతుందని గిల్ పేర్కొన్నాడు. 'జూలై నెల ఐసీసీ ప్లేయర్‌గా ఎంపిక కావడం ఎంతో సంతోషం. బర్మింగ్‌హామ్ టెస్టులో చేసిన డబుల్ సెంచరీ నాకు ప్రత్యేకమైనది. ఈ పర్యటనలో సారథ్య బాధ్యతలు కూడా నిర్వహించడం సంతృప్తిని ఇచ్చింది. అనేక విషయాలు నేర్చుకున్నాను. రాబోయే సిరీస్‌ల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. బర్మింగ్‌హామ్‌లోని రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో ద్విశతకం, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో సెంచరీ సాధించాడు. ఈ విజయంతో భారత్ టెస్టును గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అంతేకాక, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ సెంచరీలు బాదాడు.