Karn Sharma: టీమిండియా స్పిన్నర్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ (38) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు భారత దేశవాళీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. కర్ణ్ శర్మ భారత్ తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఆగస్టు 25న మీరట్ మావెరిక్స్‌తో జరిగే మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని తెలిపాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌తో పాటు క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
వివరాలు
వరుసగా మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు
అంతర్జాతీయ కెరీర్‌లో కర్ణ్ శర్మకు ఎక్కువ అవకాశాలు దక్కకపోయినా.. ఐపీఎల్‌లో మాత్రం తనదైన ముద్ర వేశాడు.
ఈ టోర్నీలో 90 మ్యాచ్‌లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. మూడు వేర్వేరు జట్లతో వరుసగా మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా కర్ణ్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017లో ముంబయి ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ట్రోఫీలను అందుకున్నాడు.