Ravindra Jadeja : శ్రీలంకతో టెస్టు సిరీస్.. జడేజా ముందు మూడు కీలక రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు 'గాలే' ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 8 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ సిరీస్‌కు ముందు పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు.
వివరాలు
నాలుగు వికెట్లు తీస్తే..
శ్రీలంకతో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన జడేజా.. 33 వికెట్లు పడగొట్టాడు. 23.72 బౌలింగ్ సగటుతో రాణించిన అతడు.. రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
శ్రీలంకపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ప్రస్తుతం ఇషాంత్ శర్మ 36 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
జడేజా మరో నాలుగు వికెట్లు తీస్తే ఇషాంత్‌ను అధిగమించి ఆ స్థానాన్ని దక్కించుకుంటాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 74 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (62), హర్భజన్ సింగ్ (53), కపిల్ దేవ్ (45) ఉన్నారు.
ఇక భారత్-శ్రీలంక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కొనసాగుతున్నాడు.
వివరాలు
350 వికెట్ల క్లబ్‌లోకి..
అతడు ఏకంగా 105 వికెట్లు సాధించాడు.
జడేజా మరో కీలక మైలురాయికి కూడా అత్యంత చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 350 వికెట్లు పూర్తి చేసేందుకు అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం జడేజా ఖాతాలో 348 టెస్టు వికెట్లు ఉన్నాయి.
శ్రీలంకతో జరిగే సిరీస్‌లో మరో రెండు వికెట్లు తీస్తే.. టెస్టుల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో ఐదో ఆటగాడిగా నిలుస్తాడు
వివరాలు
బ్యాటింగ్‌లోనూ మరో రికార్డు..
బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జడేజా మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు.
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం అతడు 19వ స్థానంలో ఉన్నాడు. జడేజా ఇప్పటివరకు 89 టెస్టుల్లో 4,095 పరుగులు చేశాడు.
అతడి కంటే ముందు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ 4,154 పరుగులతో ఉన్నాడు.
గంభీర్‌ను అధిగమించాలంటే జడేజా మరో 60 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్ 58 టెస్టుల్లో 4,154 పరుగులు సాధించాడు. ఇందులో 22 అర్ధసెంచరీలు, 9 సెంచరీలు ఉన్నాయి.
వివరాలు
18వ స్థానానికి చేరుకొనే అవకాశం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో జడేజా 60 పరుగులు చేస్తే గంభీర్‌ను వెనక్కి నెట్టి భారత్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 18వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు జడేజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 63, 22 పరుగులు చేశాడు.
బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు బౌలింగ్‌లోనూ జడేజా ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండేసి వికెట్లు పడగొట్టాడు.
దీంతో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో జడేజా ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.