LOADING...
The Ashes: రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్‌ టెస్ట్‌.. ఐసీసీ నుంచి పిచ్‌కు వచ్చిన అధికారిక రేటింగ్‌ ఇదే!
రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్‌ టెస్ట్‌.. ఐసీసీ నుంచి పిచ్‌కు వచ్చిన అధికారిక రేటింగ్‌ ఇదే!

The Ashes: రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్‌ టెస్ట్‌.. ఐసీసీ నుంచి పిచ్‌కు వచ్చిన అధికారిక రేటింగ్‌ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (The Ashes)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఈమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 172 పరుగులకే ఆలౌటైతే, అనంతరం క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా కూడా 132 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు పరిమితమైంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ టెస్ట్‌లో తొలి రోజు 19 వికెట్లు పడిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత సహజమైన పిచ్ ప్రవర్తన కారణంగా ఐసీసీ దీనికి ఏ రేటింగ్ ఇస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు.

Details

 పెర్త్ పిచ్‌కు 'వెరీ గుడ్' రేటింగ్ 

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఐసీసీ పెర్త్ పిచ్‌కు 'వెరీ గుడ్' రేటింగ్ ఇచ్చింది. ఇది పిచ్‌లు పొందగలిగే అత్యుత్తమ రేటింగ్స్‌లో ఒకటి కావడం విశేషం. ఇక ఇదిలా ఉండగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లో ముగిసింది. బంతి అతిగా టర్న్ అవ్వడం వల్ల బ్యాటర్లు భారీగా ఇబ్బంది పడ్డారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (55) ఒక్కడే నిలకడగా ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు ఐసీసీ ఏమని రేటింగ్ ఇస్తుందో అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో పెరిగింది.