LOADING...
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ సమీకరణాలు ఖరారు.. అన్ని జట్లకు ఒక లెక్క.. ఈ జట్టుకు మరో లెక్క!
టీ20 ప్రపంచకప్‌ సెమీస్ సమీకరణాలు ఖరారు.. అన్ని జట్లకు ఒక లెక్క.. ఈ జట్టుకు మరో లెక్క!

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ సమీకరణాలు ఖరారు.. అన్ని జట్లకు ఒక లెక్క.. ఈ జట్టుకు మరో లెక్క!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 దశ ముగియడంతో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించింది. మొత్తం 20 జట్లు పోటీపడిన ఈ టోర్నీలో చివరకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, టీమిండియా జట్లు ప్రవేశించాయి. పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు భారతదేశంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టమైంది. దీంతో వేదికలు, పోటీలు ఎవరి మధ్య జరగనున్నాయన్న అంశాలు వెల్లడయ్యాయి.

Details

తొలి సెమీఫైనల్

బుధవారం, మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్‌లో గ్రూప్‌-1 అగ్రజట్టు దక్షిణాఫ్రికా, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. రెండో సెమీఫైనల్‌ గురువారం, మార్చి 5న జరిగే రెండో సెమీలో గ్రూప్‌-1లో రెండో స్థానంలో నిలిచిన భారత్‌, గ్రూప్‌-2 అగ్రజట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇరు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక మార్చి 8, ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీ చివరి దశకు చేరడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Advertisement