తదుపరి వార్తా కథనం

MS Dhoni smoking: ఎంఎస్ ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్
వ్రాసిన వారు
Stalin
Jan 07, 2024
02:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్మోకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ వీడియోలో ధోనీ హుక్కా తాగుతూ కనిపించాడు. ధోనీ ఓ పార్టీకి హాజరైన సమయంలో ఈ హుక్కా తాగినట్లు ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది.
ధోనీ స్మోకింగ్ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఆయన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ధోనీ చాలా స్టైలిష్‌గా, సూట్ ధరించి, పొడవాటి జుట్టుతో హుక్కా తాగుతూ, పొగ ఊదుతూ కనిపించాడు.
కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ విజేత ఎంసీ స్టాన్‌తో కలిసి ధోనీ ఓ పార్టీలో పాల్గొన్న వీడియోలు సైతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Influential thala😭 pic.twitter.com/qJlYCApxzJ
— 𝙆𝙐𝙉𝘼𝙇/𝙁𝘼𝙍𝙄𝘿 𝙆𝙄 𝙈𝙆𝘽 (@BholiSaab18) January 6, 2024