ICC World Cup 2027: వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC Men's ODI World Cup) షెడ్యూల్ విడుదలైంది. 2027 అక్టోబరు 7న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబరు 24 వరకు రౌండ్ రాబిన్ విధానంలో మొత్తం 30 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం అక్టోబరు 25 నుంచి నవంబరు 14 వరకు సూపర్-7 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ దశలో మొత్తం 21 మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత నాకౌట్ దశ ప్రారంభం కానుంది. నవంబరు 17న సెమీఫైనల్-1, నవంబరు 18న సెమీఫైనల్-2 జరగనున్నాయి.
వివరాలు
టీమిండియా గ్రూప్ స్టేజ్ షెడ్యూల్
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబరు 21న జొహన్నెస్‌బర్గ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
అక్టోబరు 7: భారత్ × ఆస్ట్రేలియా
అక్టోబరు 10: భారత్ × పాకిస్థాన్
అక్టోబరు 14: భారత్ × అఫ్గానిస్థాన్
అక్టోబరు 17: భారత్ × క్వాలిఫయర్-ఎ
అక్టోబరు 24: భారత్ × జింబాబ్వే