IPL: ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించిన వివాదాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఆటతో పాటు వివాదాలకు కూడా కొన్ని సందర్భాల్లో కేరాఫ్ అడ్రాస్ గా నిలిచింది.
ఇప్పటికీ ప్రతి సీజన్ లోనూ ఏదోక గొడవ, వివాదం చోటు చేసుకోవడం పరిపాటైంది.
అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జరిగిన వివాదాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్లాప్ గేట్ కుంభకోణం (2008)
2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య మ్యాచ్ అనంతరం హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీంతో హర్భజన్‌ను సీజన్ మొత్తానికి సస్పెండ్ చేశారు.
Details
లలిత్ మోడీ సస్పెన్షన్ (2010)
2010లో ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ప్రస్తుతం లలిత్ మోడీ భారతదేశం బయటే ఉన్నాడు.
స్పాట్ ఫిక్సింగ్ తుఫాను (2013)
2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఐపీఎల్‌ను కుదిపేసింది. శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లను బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం విధించారు.
చెన్నై, రాజస్థాన్ సస్పెన్షన్ (2015)
2015లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై బెట్టింగ్ ఆరోపణలతో రెండు సీజన్ల పాటు సస్పెన్షన్ విధించారు.
Details
షారుఖ్ ఖాన్ నిషేధం (2012)
2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌కు వాంఖడే స్టేడియంలో భద్రతా సిబ్బందితో ఘర్షణ జరగడంతో ఐదు సంవత్సరాల నిషేధం విధించారు.
గంభీర్ వర్సెస్ కోహ్లీ ఘర్షణ (2013, 2024)
2013లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 2024లో మరోసారి కోహ్లీ-గంభీర్ వివాదం తెరపైకి వచ్చింది.
సౌరవ్ గంగూలీ తొలగింపు
(2011) 2011 ఐపీఎల్ వేలంలో సౌరవ్ గంగూలీ అమ్ముడుపోకపోవడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత పూణే వారియర్స్ జట్టులో చేరాడు.
Details
రవీంద్ర జడేజా నిషేధం (2010)
2010లో రాజస్థాన్ రాయల్స్‌తో ఒప్పందం ఉన్నా ఇతర జట్టుతో చర్చలు జరిపినందుకు రవీంద్ర జడేజాపై సీజన్‌కు నిషేధం విధించారు.
కొచ్చి టస్కర్స్ కేరళ బహిష్కరణ (2011)
2011లో ఐపీఎల్‌లో ఆడిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టును ఆర్థిక వివాదాల కారణంగా బహిష్కరించారు.
కరోనా కారణంగా వేదిక మార్పు (2020)
2020లో కరోనా వల్ల ఐపీఎల్‌ను యూఏఈకి మార్చడం వివాదాస్పదమైంది. కరోనా పరిస్థితుల్లో క్రికెట్ నిర్వహించడం విమర్శలకు దారితీసింది.