LOADING...
Women Athletes India: భారత క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన మహిళా అథ్లెట్లు ఇవే!

Women Athletes India: భారత క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన మహిళా అథ్లెట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతంలో క్రీడారంగం ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలోనే కనిపించేది. కొద్దిమంది మహిళలు మాత్రమే కొన్ని ఆటలలో పాల్గొనేవారు. మరికొన్ని క్రీడలు అయితే పూర్తిగా పురుషులకు మాత్రమే పరిమితమైనట్టుగా భావించబడేవి. అయితే కాలం మారింది. ప్రస్తుతం మహిళలు అన్ని క్రీడల్లోనూ అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తమ విజయాలతో అనేకమంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా భారత క్రీడారంగంలో విశేష కీర్తి సాధించిన ప్రముఖ అథ్లెట్ల గురించి తెలుసుకుందాం.

Details

పీవీ సింధు

ఈ తరం యువతకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పివి.సింధు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అనేక బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచి, బ్యాడ్మింటన్‌లో భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది. మిథాలీ రాజ్ జెంటిల్‌మెన్‌ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అనేక రికార్డులు సృష్టించింది. మహిళా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా (7805 పరుగులు) చరిత్రలో నిలిచింది. భారత మహిళా క్రికెట్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన అగ్రగామి ఆటగాళ్లలో ఆమె ఒకరు.

Details

సానియా మీర్జా

భారత టెన్నిస్‌లో అత్యంత గుర్తింపు పొందిన స్టార్ అథ్లెట్ సానియా మిర్జా. 2003 నుంచి దశాబ్దానికి పైగా అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. తన కెరీర్‌లో 6 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుని, డబుల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్-1 ర్యాంక్‌ను సాధించింది. అలాగే భారత్‌లో సింగిల్స్ విభాగంలో అత్యధిక కాలం నెంబర్-1గా కొనసాగిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన నాయకురాలు హర్మన్‌ప్రీత్‌కౌర్. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు 2023 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరుకోవడం గర్వకారణం. ఆమె ధైర్యమైన ఆటతీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించింది.

Advertisement

Details

క్రీడాకారిణుల విజయగాథలు స్ఫూర్తిదాయకమే!

భారత మహిళా క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన అథ్లెట్లు ఎంతో మంది ఉన్నారు. బాక్సింగ్‌లో మేరీ కోమ్, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, స్ప్రింటింగ్‌లో ద్యుతీ చంద్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో వినేష్ ఫోగట్, వంటి క్రీడాకారిణులు తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకువచ్చారు. వీరి కృషి, పట్టుదల, విజయాలు అనేకమంది యువతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మహిళా క్రీడాకారిణుల విజయగాథలు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చేవే.

Advertisement