
Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
14 ఏళ్ల టెస్టు క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ.
123 టెస్టుల్లో 9,230 పరుగులతో భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించిన కోహ్లీ.. సోమవారం (మే 12) టెస్టు ఫార్మాట్‌కు అధికారికంగా వీడ్కోలు తెలిపాడు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో అతని పోరాట పటిమ, మైదానంలో చూపించిన దూకుడుతో భారత జట్టు ఎన్నో మరుపురాని విజయాలను సాధించింది.
అయితే కోహ్లీ టెస్టుల్లో ఆడిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌పై ఓసారి లుకేద్దాం.
Details
1. దక్షిణాఫ్రికాపై 119 (జొహానెస్‌బర్గ్, 2013)
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌కు నెల రోజుల్లో జొహానెస్‌బర్గ్‌లో సీమింగ్ పిచ్‌పై దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ జరిగింది.
అటు డేల్ స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్ వంటి అగ్రగామి పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ కోహ్లీ చేసిన సెంచరీ ఆయన టెస్టు కెరీర్‌కు బలమైన ఆరంభం ఇచ్చింది.
సచిన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు తానేనని చాటిచెప్పాడు.
2. ఆస్ట్రేలియాపై 141 (అడిలైడ్, 2014)
విరాట్‌ను టాలెంట్ నుండి లెజెండ్‌గా మార్చిన ఇన్నింగ్స్ ఇది.
2014 అడిలైడ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుండగా, కోహ్లీ చేసిన 141 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణంగా నిలిచింది.
మ్యాచ్ గెలవకపోయినా.. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి తన ప్రత్యేకతను నిరూపించాడు.
Details
3. ఇంగ్లాండ్‌పై 235 (ముంబయి, 2016)
ఇంగ్లాండ్‌పై 2008 తర్వాత టెస్టు సిరీస్ గెలవకపోయిన భారత్‌కు 2016 సిరీస్ విజయానికి కోహ్లీ మెరుగైన ఆరంభం అందించాడు.
వాంఖడేలో నాల్గో టెస్టులో అతను చేసిన 235 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే 400 పరుగులు చేసింది. అయినా కోహ్లీ బ్యాటింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.
Details
4. ఇంగ్లాండ్‌పై 149 (ఎడ్జ్‌బాస్టన్, 2018)
ఇంగ్లాండ్ పిచ్‌లపై విరాట్ బలహీనంగా ఉందనే విమర్శల నడుమ 2018 ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అతను చేసిన 149 పరుగులు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి.
వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతున్న సమయంలో స్టాండ్‌లో నిలబడి ఒంటరిగా పోరాడిన కోహ్లీ తన తొలి ఇంగ్లాండ్ సెంచరీ నమోదు చేశాడు.
5.ఆస్ట్రేలియాపై123(పెర్త్, 2018)
పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 8/2తో కష్టాల్లో ఉన్న సమయంలో కోహ్లీ 123 పరుగులతో జట్టును నిలబెట్టాడు.
అతని పట్టు, ఆసీస్ పేసర్లను ఎదుర్కొన్న ధైర్యం, మెరుపులు చూసి జస్టిన్ లాంగర్ ఇలా అన్నాడు. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ అని ప్రశంసించాడు.
కోహ్లీ వీడ్కోలు పలికినా అతడి ఇన్నింగ్స్‌లు ఎప్పటికీఅభిమానుల మదిలో నిలిచిపోతాయి.