
Jasprit Bumrah: '8 నెలలు కూడా ఆడలేడని అనేవారు… కానీ ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి' : బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి టీమిండియాకు పెద్ద ఊరటను కలిగించాడు. ఇతర బౌలర్ల నుంచి పెద్దగా సహకారం రాకపోయినప్పటికీ, తానే భారాన్ని మోసుకుంటూ జట్టును నిలకడగా ఉంచాడు. భారత్ ఆధిక్యాన్ని ఇంగ్లండ్ తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు, బుమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థులన్ని నిలువరించాడు. ఎలాంటి పరిస్థితులైనా, ఏ సమయంలోనైనా, బంతిని అందిస్తే వికెట్లు తీయగలనని మరోసారి నిరూపించాడు
Details
10 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ - విమర్శలకు సమాధానం
తరచూ గాయాల బారిన పడే బుమ్రా, మొదట్లో 8-10 నెలలు మాత్రమే క్రికెట్ ఆడగలనని విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో సగర్వంగా 10 ఏళ్లు పూర్తి చేశాడు. అతని ఆత్మవిశ్వాసం, పట్టుదలే టీమ్‌ఇండియాలో అగ్రశ్రేణి పేసర్‌గా నిలబెట్టాయి. ఇంగ్లండ్‌పై మరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన అనంతరం, గాయాలపై వచ్చిన విమర్శలకు బుమ్రా స్పందించాడు.
Details
'విమర్శకులను అలాగే అననివ్వండి'
'ఇన్ని సంవత్సరాలుగా కొందరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కొందరు '8 నెలలు మాత్రమే ఆడతాడు', మరికొందరు '10 నెలలు మాత్రమే' అని అనేవారు. కానీ నేను అంతర్జాతీయ క్రికెట్ 10 ఏళ్లు పూర్తి చేశాను. 12-13 ఏళ్లు ఐపీఎల్ ఆడాను. నేను గాయాల బారిన పడినప్పుడల్లా కొందరు 'కెరీర్ ముగిసింది' అని ప్రకటిస్తారు. వారిని అలాగే అననివ్వండి. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నాలుగు నెలలకు ఒకసారి ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. నాలో శక్తి ఉన్నంత వరకు నేను ఆడతూనే ఉంటాను. నా శక్తినంతా పెట్టే బాధ్యత నాది, మిగతా విషయాలను దేవుడికే వదిలేస్తానని బుమ్రా పేర్కొన్నాడు.
Details
వారిని నియంత్రించడం నా పని కాదు
తనపై రాసే వార్తలను తాను నియంత్రించలేనని, కొంతమంది వ్యూయర్‌షిప్ కోసమే తన పేరును వినియోగిస్తారని, తాను వాటిని పట్టించుకోనని బుమ్రా అన్నారు. నా గురించి ఏం రాయాలో నేను వారికి సలహా ఇవ్వలేను. వారు వ్యూయర్‌షిప్ కోసం నా పేరును ఉపయోగిస్తారు. కానీ వాటిని నేను పట్టించుకోనని చెప్పారు. రికార్డుల రారాజు తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో బుమ్రా పలు రికార్డులను సృష్టించాడు. విదేశీ గడ్డపై ఎక్కువసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంలో కపిల్‌దేవ్ సరసన చేరాడు. సేనా (SENA) దేశాల్లో టెస్టుల్లో 150 వికెట్లు తీయడంలో మొదటి ఆసియా పేసర్‌గా నిలిచాడు.