
ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 277 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు అదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ్ టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండుల్కర్(18)ని ఔట్ చేశాడు.
అనంతరం గౌతం గంభీర్(97), ధోని(91) పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్ ను సాధించింది. సచిన్ పెవిలియానికి వెళ్లే సమయంలో విరాట్ కోహ్లీతో ముచ్చిటించిన విషయాన్ని వెల్లడించారు.
Details
కోహ్లీకి సూచనిచ్చిన సచిన్
కోహ్లీ క్రీజులోకి వచ్చే ముందు బంతి కొద్దిగా స్వింగ్ అవుతోందని, జాగ్రత్త అంటూ కోహ్లీతో చెప్పానని సచిన్ వెల్లడించారు.
ఈ క్రమంలో గంబీర్ తో కలిసి నాడు కోహ్లీ 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి విరాట్ 35 పరుగుల వద్ద దిల్షాన్ బౌలింగ్ లో ఔట్ అయిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయాన్ని అందించిన ధోని ఫ్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచాడు.
టీమిండియా విజయం సాధించిన అనంతరం సచిన్ టెండుల్కర్ ను సహాచర ఆటగాళ్లు భూజాలపై ఊరేగించి సముచిత గౌరవాన్ని కల్పించారు.