
ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.
మరో వారం రోజుల్లో లీగ్ లో తొలి దశ మ్యాచ్ లు ముగియనున్నాయి. అయితే ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో కేవలం బీసీసీఐ లీగ్ మ్యాచ్ ల షెడ్యుల్ నే ప్రకటించింది.
తాజాగా ఫ్లేఆప్, ఫైనల్ మ్యాచ్ ల తేదీలు, వేదికల వివరాలను బీసీసీఐ వెల్లడించింది.
మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో పాటు రెండు ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు చైన్నై వేదిక కానుంది.
ఈ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు మే 21తో ముగుస్తాయి.
details
ఆహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్
క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ మే 23న చైన్నైలోని MA చిదంబరంలో స్టేడియంలో జరుగనుంది. మే 24న చైన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.
అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే26 జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ తో పాటు మే 28న జరగనున్న ఫైనల్ మ్యాచ్ ను ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం ఇది రెండోసారి విశేషం. 2019 తర్వాత చైన్నైలోని ఫ్లేఆఫ్స్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.