Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ పుజారా కుటుంబంలో విషాదం.. బావమరిది ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక మీడియా ప్రకారం ఈఘటన బుధవారం(నవంబర్ 26)చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న వెంటనే మాల్వియానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జీత్‌ను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మాత్రమే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెప్పారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే 2024లో అదే రోజున జీత్ మాజీ ప్రియురాలు ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది.
Details
లైంగిక దాడి చేశాడని కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడని, నిశ్చితార్థం తర్వాత కూడా వేధింపులు కొనసాగించాడని, చివరకు సంబంధాన్ని ఒక్కసారిగా విరమించుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదైన రోజునే జీత్ ఆత్మహత్య చేసుకోవడంతో, ఆ కేసుకు సంబంధించిన తీవ్ర ఒత్తిడే ఈ ఘోర నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛతేశ్వర్ పుజారా 2013లో జీత్ సోదరి పూజా పబారిని వివాహం చేసుకున్నారు. భారత టెస్ట్ జట్టులో కీలక బ్యాటర్‌గా నిలిచిన పుజారా, ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఆయన భార్య పూజా 'ది డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.