Loading...
Spain Footballer: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గోల్‌కీపర్‌ మోకాలు తగిలి ఆటగాడు మృతి!
ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గోల్‌కీపర్‌ మోకాలు తగిలి ఆటగాడు మృతి!

Spain Footballer: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గోల్‌కీపర్‌ మోకాలు తగిలి ఆటగాడు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్పెయిన్‌లో జరిగిన ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొన్న 30 ఏళ్ల ఫుట్‌బాలర్‌ ప్రాణాలు కోల్పోయాడు. సీడీ టెనెరిఫ్‌, ఎఫ్‌సీ ఆండోరా క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గోల్‌కీపర్‌తో ఢీకొన్న వెంటనే ఆటగాడు మైదానంలోనే కుప్పకూలగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూశాడు.

వివరాలు

గోల్‌కీపర్‌ మోకాలు బలంగా తగలడంతో..

స్పెయిన్‌లోని ఎస్టాడియో మైదానంలో సోమవారం ఈ మ్యాచ్‌ జరిగింది.

ఇరు జట్లు 2-2 స్కోర్‌తో సమంగా ఉన్న సమయంలో టెనెరిఫ్‌ క్లబ్‌కు చెందిన ఆటగాడు జీసస్‌ డి మిగెల్‌ (30) బంతిని అందుకునేందుకు వేగంగా ముందుకు దూసుకొచ్చాడు.

అదే సమయంలో ఆండోరా జట్టు గోల్‌కీపర్‌ జీసస్‌ ఓనో.. బంతిని అడ్డుకునేందుకు గోల్‌పోస్ట్‌ నుంచి పెనాల్టీ ఏరియా వైపు వచ్చాడు.

ఈ క్రమంలో గోల్‌కీపర్‌ ఓనో మోకాలు.. మిగెల్‌ ఛాతీకి బలంగా తగిలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాలు

కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌.. ఐదు నిమిషాల తర్వాత పల్స్

గోల్‌కీపర్‌తో ఢీకొన్న వెంటనే మిగెల్‌ నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురయ్యాడు.

అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి చేరుకుని అతడికి సీపీఆర్‌ (CPR) చేశారు. దాదాపు ఐదు నిమిషాల తర్వాత మిగెల్‌కు పల్స్‌ తిరిగి వచ్చింది.

దీంతో వెంటనే అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం మిగెల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

ADVERTISEMENT

వివరాలు

టెనెరిఫ్‌ క్లబ్‌ సంతాపం

తమ ఆటగాడు మిగెల్‌ మరణవార్తను టెనెరిఫ్‌ క్లబ్‌ అధికారికంగా వెల్లడిస్తూ సంతాపం ప్రకటించింది. అతడి మృతితో క్లబ్‌ వర్గాలు, ఫుట్‌బాల్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

మిగెల్‌ 2015లో తన సీనియర్‌ ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి పలు క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాదే టెనెరిఫ్‌ క్లబ్‌లో చేరాడు.

కెరీర్‌లో కొనసాగుతున్న సమయంలోనే ఇలా మైదానంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని విషాదానికి గురిచేసింది.

ADVERTISEMENT