Loading...
India A vs New Zealand A: మళ్లీ విఫలమైన రాహుల్‌, జైస్వాల్‌.. పీకల్లోతు కష్టాల్లో భారత్‌-ఏ జట్టు
మళ్లీ విఫలమైన రాహుల్‌, జైస్వాల్‌.. పీకల్లోతు కష్టాల్లో భారత్‌-ఏ జట్టు

India A vs New Zealand A: మళ్లీ విఫలమైన రాహుల్‌, జైస్వాల్‌.. పీకల్లోతు కష్టాల్లో భారత్‌-ఏ జట్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌటైన భారత జట్టుకు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్‌-ఏ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. 204 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌-ఏ జట్టుకు ఆరంభంలోనే వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్‌ కేవలం 5 పరుగులు చేసి సిమోన్ నీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

వివరాలు 

317 పరుగులకు న్యూజిలాండ్‌-ఏ ఆలౌట్

ఫ్రేసర్ హీట్ బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

దీంతో భారత్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత జట్టు ఇంకా 194 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌-ఏ జట్టు 317 పరుగులకు ఆలౌటైంది.

ఆ జట్టు కెప్టెన్‌ రైస్ మేరీ 76 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్‌ 51 పరుగులతో అర్ధశతకం సాధించాడు.

వీరితో పాటు కర్టిస్ హీఫే 44, క్రిస్టియన్ క్లార్క్ 42 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

తీవ్ర ఒత్తిడిలో టీమిండియా 

భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్‌, అకిబ్ నబీ తలో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు.

ముకేశ్ చౌదరీ, సుందర్ చెరో వికెట్‌ సాధించారు. అంతకుముందు భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌటైంది.

దీంతో న్యూజిలాండ్‌-ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత ఓపెనర్లు త్వరగా పెవిలియన్‌కు చేరడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతోంది.

ADVERTISEMENT