US Open 2024: గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జనిక్ సిన్నర్
యానెక్ సినర్ తన అద్భుతమైన ఆటతో, తాను నంబర్‌వన్ ర్యాంకుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు. చుట్టూ డోపింగ్ వివాదం అలుముకున్నప్పటికీ, ఒత్తిడికి లోనుకాకుండా, తన ప్రత్యర్థుల దూకుడును ఎదుర్కొంటూ, యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సినర్ 6-3, 6-4, 7-5తో పన్నెండో సీడ్ ఫ్రిట్జ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో మేటి ఫామ్‌లో ఉన్న సినర్ ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఫ్లషింగ్ మెడోస్‌లో ప్రేక్షకులమధ్య జరిగిన ఈ తుదిపోరులో ఎక్కువ మంది ఫ్రిట్జ్‌కు మద్దతు ఇచ్చినా, 23 ఏళ్ల సినర్ తన ఆటను స్థిరంగా కొనసాగించాడు.
సినర్ మూడుసార్లు ఫ్రిట్జ్ సర్వీస్‌ను బ్రేక్ చెయ్యడంతో..
తొలి సెట్లో బేస్‌లైన్ గేమ్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచిన సినర్ 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తొమ్మిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్ బ్రేక్ చేసి సెట్లో ఆధిక్యం సాధించాడు. ఈ సెట్లో, సినర్ మూడుసార్లు ఫ్రిట్జ్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో విజయం సాధించాడు. రెండో సెట్లో సినర్ ధాటికి ఫ్రిట్జ్ నిలువలేకపోయాడు. తన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని తీవ్రంగా పరీక్షించడంతో సెట్‌ను తేలిగ్గా గెలిచాడు.
అనవసర తప్పిదాలతో ఫ్రిట్జ్ ఓటమి
మూడో, నిర్ణయాత్మక సెట్లో ఫ్రిట్జ్ పుంజుకున్నాడు. సర్వీస్‌లో గట్టి పోటీ ఇచ్చి, ఏస్‌లతో అదరగొట్టాడు. అయితే, సెట్ను టైబ్రేకర్‌కు తీసుకువెళ్లాలని అనిపించిన సమయంలో, 6-5 ఆధిక్యంలో ఉన్న సినర్ పన్నెండో గేమ్‌లో తన ఫోర్‌హ్యాండ్ షాట్తో విజయాన్ని ఖాయపరచుకున్నాడు. ఫ్రిట్జ్ నెట్‌ను దాటించలేకపోవడంతో సినర్ మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకున్నాడు. మొత్తం ఆరు ఏస్‌లు కొట్టిన సినర్ 23 విన్నర్లు సాధించాడు, కానీ నాలుగు డబుల్ ఫాల్ట్స్, 34 అనవసర తప్పిదాలతో ఫ్రిట్జ్ ఓటమి పాలయ్యాడు.