Vaibhav Sooryavanshi : రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ ఫోకస్.. మరి టెస్టుల్లోనూ రాణిస్తాడా?
ఈ వార్తాకథనం ఏంటి
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత చిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా చాటిన ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌పైనా దృష్టి పెట్టాడా? అంటే క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే టెస్టుల్లో రాణించాలంటే వైభవ్ తన ఆటతీరులో కొన్ని కీలక మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్టార్ బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆధిపత్యం చెలాయించాడు.
వివరాలు
అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం..
మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా అతడు ధీటుగా ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్‌లో చూపించిన ఆ ప్రతిభే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం దక్కేలా చేసింది.
అయితే లీగ్ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందని వైభవ్‌కు త్వరగానే అర్థమైంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
అందులోనూ ఇంగ్లాండ్ గడ్డపై ఆడటంతో అతడికి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయి.
అయితే జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో మాత్రం ఈ యువ బ్యాటర్ తన అసలు సత్తా చాటాడు.
వివరాలు
అడుగులు అటువైపేనా?
వరుసగా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకుని తొలిసారి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు.
దీంతో వైభవ్‌ను మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెలక్టర్లు అతడికి ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
భారత టెస్టు జట్టులో చోటు సంపాదించాలనుకుంటున్న ఈ యువ ఆటగాడికి ఇది మంచి అవకాశంగా మారనుంది.
టీ20 క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వన్డే ఫార్మాట్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ అతడి బ్యాటింగ్ విధ్వంసాన్ని అభిమానులు చూశారు.
భారీ శతకాలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పుడు రాబోయే సీజన్‌లో దులీప్ ట్రోఫీకి కూడా వైభవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
వివరాలు
10 రోజుల క్యాంప్..
రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతడు నాణ్యమైన ప్రదర్శన చేస్తూ భారీగా పరుగులు సాధిస్తే.. త్వరలోనే భారత టెస్టు జట్టులోకి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతానికి భారత టెస్టు జట్టులో తుది జట్టులో చోటు కోసం పెద్దగా ఖాళీలు లేకపోయినా.. స్క్వాడ్‌లోకి అవకాశం వస్తే అది వైభవ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు అతడు ఇప్పటికే సాధన కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నాగ్‌పుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ నిర్వహిస్తున్న 10 రోజుల క్యాంప్‌లో వైభవ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.