Vaibhav Suryavanshi: వైరల్‌గా మారిన వైభవ్ 'ఏ' సంబరాలు.. అసలు కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-2026లో యువ సంచలనంగా నిలుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్‌కు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా కనిపించిన ఈ యువ ఆటగాడు.. తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన వైభవ్ సెంచరీ దిశగా దూసుకెళ్లినా త్రుటిలో ఆ అవకాశం చేజారింది. మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 93 పరుగులు సాధించి ఔటయ్యాడు.
వివరాలు
ప్రతి మ్యాచ్‌లో కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తా: వైభవ్
అయితే అతడి ఇన్నింగ్స్‌తో పాటు హాఫ్ సెంచరీ తర్వాత చేసిన ప్రత్యేక సంబరాలు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. తన చేతి వేళ్లతో 'ఏ' ఆకారాన్ని చూపిస్తూ సంబరాలు చేసుకోవడంతో దాని అర్థం ఏంటన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో వ్యాఖ్యాత మురళీ కార్తిక్ ఈ విషయంపై వైభవ్‌ను ప్రశ్నించారు. మొదట సరదాగా స్పందించిన వైభవ్.. తాను ఎందుకు అలా చేశానో తనకే తెలియదంటూ నవ్వులు పూయించాడు. గత మ్యాచ్‌లో కూడా ఇలాంటి సంబరాలే చేశానని, ప్రతి మ్యాచ్‌లో కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంటానని తెలిపాడు. చివరికి ఆ సంబరాల వెనకున్న అసలు కారణాన్ని వెల్లడించాడు.
వివరాలు
చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే..
ఈ ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం చేస్తున్నానని చెప్పాడు. ఆమె పేరు 'ఏ' అక్షరంతో ప్రారంభమవుతుందని, అందుకే ఆ గుర్తును చూపించానని వివరించాడు. వైభవ్ భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబయితో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో స్థానం ఖాయం చేసుకోనుంది. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తల్లికోసమే ఆ సంబరాలు.. వైభవ్ చెప్పిన నిజం
𝙎𝙘𝙤𝙧𝙚 𝙧𝙪𝙣𝙨. 𝙄𝙣𝙫𝙚𝙣𝙩 𝙘𝙚𝙡𝙚𝙗𝙧𝙖𝙩𝙞𝙤𝙣. 𝙍𝙚𝙥𝙚𝙖𝙩. 👏#VaibhavSooryavanshi is keeping everyone guessing, including himself! 😅#TATAIPL #VaibhavSooryavanshi #RRvLSG pic.twitter.com/lwyuGt9UsC
— Star Sports (@StarSportsIndia) May 19, 2026