
Varun Chakravarthy: తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మాయాజాలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లకు వరుణ్ బంతితో చుక్కలు చూపించాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ బ్యాటర్లకు సవాలుగా మారింది. వరుణ్ తన అద్భుతమైన గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను బెదరించాడు. అతని దెబ్బకు ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మొత్తం 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇది వరుణ్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రెండోసారి ఐదు వికెట్లు తీయడం. తన ప్రదర్శనతో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వివరాలు
వరుణ్ సాధించిన రికార్డులు:
వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ ఐదు వికెట్లు తీసిన వరుణ్, ఇప్పుడు ఇంగ్లండ్‌పై కూడా అదే ఫీట్‌ను సాధించాడు. వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పదివికెట్లకు పైగా తీసిన బౌలర్‌గా కూడా వరుణ్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 12 వికెట్లు తీసిన అతను, ఇంగ్లండ్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ సాధించిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచాడు.
వివరాలు
టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు వీరే..
దీపక్ చాహర్ 6/7 యుజ్వేంద్ర చాహల్ 6/25 భువనేశ్వర్ కుమార్ 5/4 కుల్దీప్ యాదవ్ 5/17 వరుణ్ చక్రవర్తి 5/17 భువనేశ్వర్ కుమార్ 5/24 కుల్దీప్ యాదవ్ 5/24 వరుణ్ చక్రవర్తి 5/24