Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్
మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎలా ఉండాలనే అంశంపై వెటరన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు. జట్టులో ఎప్పుడూ కొత్త కుర్రాళ్లకే అవకాశం ఇవ్వాలన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ మరింత దృష్టిపెట్టాలని సూచించాడు. స్పిన్నర్లపై శివమ్ దూబే అత్యద్భుతంగా దాడి చేస్తాడన్నారు. టీ 20లో సూర్య కుమార్ యాదవ్, ఫినిషర్ రింకూ సింగ్ గురించి ఏం ఆలోచించనవసరం లేదన్నారు. మిడిలార్డర్లో వీరు చాలా కీలకం.తుది 11 మంది జాబితాలో ఈ ముగ్గురికి స్థానం తప్పనిసరి అన్నారు. ఎలాగూ విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ జట్టుతోనే ఉంటారు కాబట్టి వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకుంటారనేది వేచి చూడాలి అని వెంకటేష్ ప్రసాద్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.