#viral Moment: రాహుల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి బంతికే డక్ అవుట్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతున్న సమయంలో మొదటి బంతిలోనే అవుట్ అయ్యాడు. 142 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఢిల్లీకి మంచి ఆరంభం కావాల్సిన సమయంలో రాహుల్ అవకాశాన్ని మిస్ చేశాడు. లక్నో ఆటగాడు మహమ్మద్ షమీ.. రాహుల్‌ను తొలి బంతిలోనే అవుట్ చేశారు. రాహుల్ డ్రైవ్ ఆడగా పెద్ద ఎడ్జ్ వచ్చింది. మోహ్సిన్ ఖాన్ క్యాచ్ పట్టి రాహుల్‌ను అవుట్ చేశారు.
వివరాలు
రాహుల్ రికార్డులివే..
రాహుల్ విషయానికి వస్తే.. టీ20 క్రికెట్‌లో 227 ఇన్నింగ్స్ (240 మ్యాచ్‌లు)లో 11 డక్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అతను 8,125 పరుగులు 42.31 సగటుతో, 68 ఫిఫ్టీస్, 7 హండ్రెడ్‌లు సాధించాడు. ఇప్పటి వరకు రాహుల్ ఐపీఎల్ డక్స్ సంఖ్య 5. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో 146 మ్యాచ్‌లలో 137 ఇన్నింగ్స్‌లు ఆడి 5 సార్లు ఆయన డక్ అవుట్ అయ్యారు. ఐపీఎల్‌లో రాహుల్ 5,222 పరుగులు 45.80 సగటుతో, 40 ఫిఫ్టీస్, 5 హండ్రెడ్‌లు సాధించి రికార్డులు క్రియేట్ చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
In the air.....and TAKEN 😍
— IndianPremierLeague (@IPL) April 1, 2026
A superb start for @LucknowIPL 👌
Mohd. Shami gets KL Rahul 1️⃣st ball 👏
Updates ▶️ https://t.co/lfP7dRNKfg#TATAIPL | #KhelBindaas | #LSGvDC pic.twitter.com/oPUcn7ptCf