#viral Moment: అబ్బబ్బా..ఎంతపని చేశావ్ రోహిత్..ఆ ఒక్క తప్పు మ్యాచ్ మొత్తాన్నే మార్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా కొనసాగింది. అయితే ఒక చిన్న పొరపాటు కూడా మ్యాచ్ ఫలితంపై ఎంతటి ప్రభావం చూపగలదో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. మ్యాచ్‌లో రోహిత్ శర్మ చేసిన ఒక కీలక తప్పిదం ముంబయి ఇండియన్స్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అంగకృష్ణ్ రఘువంశి 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు వచ్చిన సులభమైన క్యాచ్‌ను రోహిత్ పట్టుకోలేకపోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 67 పరుగులు సాధించి జట్టును బలంగా ముందుకు నడిపించాడు.
వివరాలు
పవర్ ప్లేలో భారీ స్కోర్
అలాగే ఫిన్ అలెన్ వేగంగా 37 పరుగులు చేసి పవర్‌ప్లే దశలోనే భారీ స్కోర్‌కు బలమైన పునాది వేశాడు. మధ్య ఓవర్లలో ముంబై బౌలర్లు కొంతవరకు పరుగులను నియంత్రించినప్పటికీ, చివరి దశలో అంగకృష్ణ్ రఘువంశి మరింత దూకుడుగా ఆడాడు. అతను 29 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 200 దాటేలా చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. వాంఖడే స్టేడియంలో ఈ పెద్ద స్కోర్ ముంబై జట్టుకు కఠిన పరీక్షగా మారింది. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కనిపించాడు. ఆఖరికి ముంబయి ఘన విజయం సాధించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్:
Rohit Sharma Dropped Catch of Raghuvanshi At Crucial Moment of the game #Rohitsharma #ipl2026 #MIVSKKR pic.twitter.com/OltvayDQSQ
— Tushar Thakar (@iamtthakar) March 29, 2026